Hydra : నేడు హయత్ నగర్ లో హైడ్రా (Hydra) కూల్చివేతలను ప్రారంభించింది. హయత్ నగర్ మండలం కోహెడలో ప్లాట్లు ను కబ్జా చేసి భారీ రియల్టర్ ఫామ్ హౌస్ నిర్మించాడు. సర్వే నెంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియాల్టర్ సంరెడ్డి బాల్ రెడ్డి కబ్జా చేసాడు. అయితే 170 మంది ప్లాట్స్ ఓనర్లు హైడ్రాను ఆశ్రయించారు. ఈ క్రమంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.