హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా టీమ్స్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసిబి సహాయంతో కూల్చివేయిస్తున్నారు. కాగా అంబర్ పేట్ బతుకమ్మ కుంటకు చేరుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.