Hydra: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తామని వెల్లడించారు.హైదరాబాద్ -బుద్ధభవన్ లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సా.5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు చేసే ముందు అన్ని ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని నగర ప్రజలకు కమిషనర్ సూచించారు.