Homeహైదరాబాద్latest Newsతగ్గేదేలేదంటున్న హైడ్రా.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో కొనసాగుతున్న కూల్చివేతలు..

తగ్గేదేలేదంటున్న హైడ్రా.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో కొనసాగుతున్న కూల్చివేతలు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై  హైడ్రా అధికారులు తగ్గేదే లేదంటున్నారు. శేరిలింగంపల్లి జోన్  చందా నగర్ సర్కిల్ 21 మాదాపూర్ డివిజన్ పరిధిలోని తమ్మిడి చెరువులో చెరువు ఎఫ్టియల్ లో సుమారు 4 ఎకరాల్లో ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఇటీవల పలు పిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా అధికారులు శనివారం ఉదయమే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేతకు ఉపక్రమించారు.  హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ కూల్చివేత లను స్వయంగా  పర్యవేక్షిస్తున్నారు.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై జనం కోసం స్వచ్ఛంద సంస్థ  ఇటీవల పూర్తి ఆధారాలతో సహా హైడ్రా కమిషనర్ కు పిర్యాదు చేసిన విషయం విదితమే. నాగార్జున సినీ హీరో కావడం రాజకీయ పలుకుబడి ఉండటంతో హైడ్రా అధికారులు వాటి జోలికి వెళ్ళరనే అంతా భావించారు. కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గ కుండా హైడ్రా తన పనితాను చేసుకుపోతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదేవిధంగా మరోవైపు చెరువులు ఆక్రమణచేసి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తు తున్నాయి.

Recent

- Advertisment -spot_img