ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను హైడ్రా కూల్చదు అని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైడ్రా కూల్చిన తర్వాత వ్యర్థాలను ఆ బిల్డరే తొలగించాలని అన్నారు. అక్కడ పూర్వ స్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్యత బిల్డర్లపైనే ఉందని చెప్పారు. లేనిపక్షంలో వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే పలువురికి హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు.