Homeహైదరాబాద్latest Newsనా భర్త పర్మిషన్​తోనే చేశా..

నా భర్త పర్మిషన్​తోనే చేశా..

డాన్సర్ గా ప్రేక్షకులకు పనిచయమైన ఆనంది తరువాత హీరోయిన్ గా మారి మంచి మంచి సినిమాలు చేశారు. తెలుగు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన ఫేమ్ తోనే తెలుగులో జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఇక తాజాగా మరో క్రేజీ అండ్ బోల్డ్ ఆఫర్ దక్కించుకుంది ఆనంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగై. బైలాగ్వల్ మూవీగా వస్తున్న ఈ సినిమాను గుబెన్థిరన్ కామత్చి తెరకెక్కిస్తున్నారు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మంగై సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మంగై స్క్రిప్ట్ విన్నప్పుడు  ఈ సినిమా నేను చేయలేనని చెప్పాను. కారణం.. అందులో చాలా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయి. కానీ, నా భర్త మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని ప్రోత్సహించారు. నువ్వు ఒక నటిగా ఆలోచించు అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. అందుకే ఎలాంటి బెరుకు లేకుండా ఈ సినిమా చేయగలిగాను.. అంటూ చెప్పుకొచ్చాడు ఆనంది.

ఇక మంగై సినిమా విషయానికి వస్తే.. మున్నార్ నుండి చెన్నైకి ప్రయాణిస్తున్న ఒక ఒంటరి అమ్మాయి కథ మంగై. ఆ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, ఒంటరి ఆడదాన్ని మగాళ్లు చూసే కోణం, వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సోషల్ ఎక్స్పరిమెంటల్ మూవీ కాబట్టి ప్రతీ ఆడియన్ కు ఈ సినిమా నచ్చుతుంది అని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Recent

- Advertisment -spot_img