టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8 దశకు చేరుకుంది. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజృంభి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్షదీప్ సింగ్‌కు ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవల్కర్(2/18) రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు . అయితే తాను ఎప్పటికీ భారతీయుడినేనని యూఎస్ఏ స్టార్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నారు. ‘ఇండియా నా జన్మభూమి.. అమెరికా నా కర్మభూమి. ఈ రెండు దేశాలంటే నాకు గౌరవం. ఈ విషయం నాకు గొప్ప అనుభూతి’ అని ఆయన అన్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను నేత్రావల్కర్ ఔట్ చేశారు.