Homeహైదరాబాద్latest Newsఆయన దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను.. తన హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన వినోద్...

ఆయన దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను.. తన హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన వినోద్ కాంబ్లీ

దేవుడి దయ వల్ల తాను ఆరోగ్యంగా ఉన్నానని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అన్నాడు. ఇటీవల వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో నడవలేని స్థితిలో ఉన్న 52 ఏళ్ల వినోద్ కాంబ్లీని చూసి క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వినోద్ కాంబ్లీ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ‘దేవుని దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను. మైదానానికి వెళ్లి బ్యాటింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నాను’అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ, భారత్ తరఫున 100కి పైగా వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

Recent

- Advertisment -spot_img