Homeహైదరాబాద్latest Newsనేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో...

నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు.. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా: కవిత

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి కవిత జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. కవితను హత్తుకుని ఆమె భర్త అనిల్‌, కుమారుడు, కేటీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత హైదరాబాద్‌ రానున్నారు. కాగా, కవిత జైలు నుంచి బయటకొచ్చాక మీడియాతో మాట్లాడుతూ ‘నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. అనవసరంగా జైలుకు పంపించి జగమొండిని చేశారు. ఓ తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండటం చాలా బాధగా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను. ఆ సమయం త్వరలోనే రాబోతుంది. నేను కేసీఆర్ బిడ్డను. మొండిదాన్ని. మంచిదాన్ని. నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. కానీ ఈ సారి కుటుంబానికి దూరంగా ఉన్నాను. నాకు నా కుటుంబానికి అండగా ఉన్నవారికి ధన్యవాదాలు. మేం ప్రజాక్షేత్రంలో మరింత గట్టిగా పనిచేస్తాం. తాము ఫైటర్లం, చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని కవిత అన్నారు.

Recent

- Advertisment -spot_img