Homeహైదరాబాద్latest Newsనేను ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నా. రేవ్ పార్టీకి వెళ్లలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి.

నేను ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నా. రేవ్ పార్టీకి వెళ్లలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి.

బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలో పాల్గొన్నారంటూ వస్తోన్న ప్రచారాన్ని నటి హేమ ఖండించింది. నెటిజన్లు ఎంత చెబుతున్నా వినడం లేదు. దీంతో హేమ తాను హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్నానంటూ చెప్తోంది. ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాను అంటూ మొత్తుకుంటోంది. ఇది చూసిన నెటిజెన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

తాను బెంగుళూరులో లేనని హైద్రాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా హేమ ఆ వీడియోలో పేర్కొన్నారు. చికెన్ ధమ్ బిర్యానీ తయారీ గురించి హేమ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కవరింగ్ ఎందుకు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

బెంగుళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఆదివారం( May 21) నాడు సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ కు చెందిన వ్యాపారి తన బర్త్ డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారని ప్రచారం సాగుతుంది.కన్నడ సీరియల్ నటులతో పాటు కొందరు తెలుగు టీవీ నటులు, మోడల్స్ కూడ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent

- Advertisment -spot_img