బెంగళూరు శివారులో ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీ పై బెంగళూరు పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు హాజరయ్యారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నటి హేమ పేరు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్ ఉన్నారనే ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నాననీ, అక్కడికి వెళ్లలేదని చెప్పారు. వీడియోలో కనిపిస్తున్నది తాను కాదని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను రేవ్ పార్టీలకు వెళ్లే వ్యక్తిని కాదని వెల్లడించారు.