ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూసీ ప్రాంతంలో మూడు నెలల పాటు కేటీఆర్, హరీశ్‌రావు ఉండాలని, అక్కడ ఉంటే తాను చెప్పినట్లే నడుచుకుంటానని సీఎం ఇటీవల అన్నారు. ఈ సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు. మూసీలో మూడు నెలల పాటు ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్నది లూటిఫికేషన్ కాదు అందలం ఎక్కుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మూసి నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లే అని తెలిపారు. మూడు నెలలు మూసీలోనే ఉండాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని.. తన ఆ సవాల్‌కు సిద్ధమన్నారు. మూసీ నది లోతును పెంచి కోల్ కతా లాంటి నగరాన్ని నిర్మించాలన్నారు. మూసీ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, వారి కోసం పోరాడుతామన్నారు.