పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన తనని బాధ కలిగింది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తెలిపారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలి అని అయన అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను అని చెప్పారు. బాధితురాలిని ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తెలిపారు.
అసలు ఏమి జరిగింది అంటే… మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అయితే అదే సమయంలో ఓ మహిళ, మరో వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆటోను ఆపారు. పేపర్ చూపించి అడ్రస్ చెప్పమని అడిగాడు. ఆ తర్వాత బాలిక ముఖంపై మత్తుమందు స్ప్రే చేశారు. స్పృహ తప్పి పడిపోయిన వెంటనే ఆమెను ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని మాధవపురం డంపింగ్ యార్డుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత బాలికకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆ వ్యక్తి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే డంపింగ్ యార్డుకు వచ్చిన ఓ మహిళ ఈ దారుణ ఘటనను చూసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.