ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ‘ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది.
ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా’ అని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.