అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘రానా దగ్గుబాటి’ షో యొక్క రాబోయే ఎపిసోడ్‌లో హీరో నాగ చైతన్య అతిథిగా హాజరయ్యారు. నాగ చైతన్యతో చేసిన ఇంటర్వ్యూ రానున్న రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ షోలో నాగ చైతన్య వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు ఇద్దరు పిల్లలు కావాలని అని నాగ చైతన్య అన్నారు. ‘‘50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా గడపాలని ఉంది’’ అని చైతూ చెప్పగా.. మీ వెంకీ మామల నీకు పెద్ద ఫ్యామిలీ కావాలా అని రానా అన్నాడు. అందుకు చైతూ బదులిస్తూ.. ‘‘వెంకీ మామది పెద్ద ఫ్యామిలీ. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలు. కొడుకు పుడితే అతణ్ణి రేస్ కోర్సుకు తీసుకెళ్తా. అమ్మాయి పుడితే తన హాబీస్, ఇష్టాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏదైనా చేస్తా. మనం చిన్నతనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాం. మళ్లీ నా పిల్లలతో సమయం గడిపి ఆ రోజుల్లో పిల్లలకి వెళ్లాలనుకుంటున్నా కుటుంబమే నా జీవితం. అది లేకుండా లైఫ్‌ను ఊహించుకోలేను అని నాగ చైతన్య తెలిపాడు.