ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ లోని హీరోలందరూ మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాకు ‘మెగా సపోర్ట్’ లభిస్తుందా లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి. అలాంటి టైమ్ లో ‘పుష్ప 2’ సినిమాపై మెగా ఫ్యామిలీ నుంచి మొదటి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘పుష్ప 2’ చిత్రబృందానికి హీరో సాయి ధరమ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారుఈ సినిమాకి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ మాట్లాడలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో ధరమ్ తేజ్ ఈ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మెగా vs అల్లు ఫ్యాన్స్ వార్ కి ఫుల్ స్టాప్ పడుతుందని తెలుస్తుంది.