సినిమా హీరో, హీరోయిన్లు అంటేనే సోషల్ మీడియాలో కామెంట్లు సర్వ సాదారణం. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రతి యాక్టర్‌పై ఏదో ఒక కామెంట్‌తో పాటు పుకార్లు పుడుతూనే ఉంటాయి. ఇక ఇలాంటి వాటిని కొంత మంది నటులు పర్సనల్‌గా తీసుకుని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారికి సోషల్‌మీడియాలోనే ఘాటైన సమాదానం ఇవ్వడం జరుగుతుంది. అయితే కొందరు ఈ కామెంట్లను పట్టించుకోరు. అలాంటి వారిలోనే తానూ ఉంటానంటుంది జాన్వీ కపూర్ తనపై వచ్చే కామెంట్లు, పుకార్లను అస్సలు పట్టించుకోను అంటుంది జాన్వీ. శ్రీదేవి, బోనీ కపూర్ల సినీ వారసురాలిగా మరాఠీ చిత్రం సైరాట్ సినిమాకు హిందీ రిమేక్‌గా వచ్చిన దడఖ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ సినమాతో ప్రేక్షకులముందుకు వచ్చంది. మరో మూడు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.