ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా.. ఐ డోంట్ కేర్ అని, రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ‘ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడం. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చు. ఎఫ్‌టీఎల్ అనేది ముఖ్యమైన అంశమే, దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తాం. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ధర్మసత్రమైనా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అని రంగనాథ్ స్పష్టం చేశారు.