Homeహైదరాబాద్latest Newsనాకు అలాంటి ఫీలింగ్స్ లేవు.. విష్ణుప్రియకి క్లారిటీ ఇచ్చిన్న పృథ్వీ

నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు.. విష్ణుప్రియకి క్లారిటీ ఇచ్చిన్న పృథ్వీ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది. దీంతో హౌసులో ఆటలు ఉత్కంఠభరితంగా సాగుతుంది. 13వ వారం నామినేషన్లలో గౌతమ్‌తో పాటు నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ మరియు అవినాష్ ఉన్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌసులో టికెట్ టూ ఫైనల్ గేమ్ మొదలైంది. అయితే టికెట్ టూ ఫైనల్ గేమ్ కోసం గత సీజన్లలో పాల్గొన్న హౌస్‌మేట్స్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక బిగ్‌బాస్ హౌసులోకి వచ్చారు. అఖిల్ విష్ణుప్రియకి కొన్ని విషయాలు చెప్పాడు. కొందరిని అక్కడ వదిలేసి ముందుకెళితే ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుందని నా భావన. అది ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకు అర్థమవుతుంది అనుకుంటా… వెంటానే నేను నీ గురించి మాట్లాడుతున్నాను విష్ణు అని అఖిల్ అన్నాడు.
దీనిపై విష్ణుప్రియ స్పందిస్తూ….ఒక వ్యక్తిని ఇష్టపడటం మాత్రమే.. అది ప్రేమా లేదా మరేదైనా అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఈ బిగ్‌బాస్ హౌసులో 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను అని విష్ణు చెప్పింది. ఇది ఇలా ఉండగా హారిక.. దీనిపై మీ అభిప్రాయం ఏంటని పృథ్వీ ప్రశ్నించింది. దీంతో పృథ్వీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. మొదట విష్ణు వచ్చినప్పుడు మేము మంచి స్నేహితులం, ఆమె తన ప్రేమని చెప్పినపుడు నేను క్లారిటీ ఇచ్చాను. నాకు ప్రేమ సెట్ అవ్వదు… నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు.. నాకు నా కెరీర్ ముఖ్యం అని విష్ణుప్రియతో చెప్పాను అని..కానీ తాను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ చెప్పసాడు.

Recent

- Advertisment -spot_img