– కోర్టును ఆశ్రయిస్తా
– మాజీ మంత్రి మల్లారెడ్డి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మంత్రి మల్లారెడ్డి మీద ఇటీవల భూకబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి, అతడి అనుచరులు భూములను కబ్జాచేసినట్టు శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదైంది. కాగా ఈ విషయంపై తాజాగా మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని చెప్పారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంఆర్‌వోతోపాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.