హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో దుల్కర్, బాలయ్య అన్ స్టాపబులు షోలో పాల్గొని తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకి కార్లంటే పిచ్చని, ఇప్పటికి తనవద్ద 70కార్లు ఉన్నాయని తెలిపారు. కానీ, తన భార్యకు తెలిస్తే తిడుతుందని కొన్ని కార్లు హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఇళ్లల్లో దాస్తానని చెప్పుకొచ్చారు.