తెలుగు గాయని దామిని భట్ల అంటే అందరికీ సుపరిచితమైన పేరు.. తన పాటలతో ప్రజలను ఆకట్టుకుంది. ‘బాహుబలి’ సినిమాలో ‘పచ్చబొట్టేసిన’ పాటతో దామిని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా గాయని దామిని ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పింది. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెబుతూ బాధగా అనిపించింది అని చెప్పింది. నా బాడీ, డ్రెస్సింగ్ స్టైల్ గురించి చాలా మంది నెగెటివ్‌గా మాట్లాడారని చెప్పింది. దాంతో కాస్త బాధగా అనిపించినా.. వాటి గురించి పెద్దగా పట్టించుకోనని వెల్లడించింది. నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం… ఇలానే ఉంటాను అంటూ దామిని ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చింది. నేనేం చేసినా కామెంట్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. పాజిటివిటీని నెగెటివ్‌గా ప్రచారం చేసేవారు చాలా మంది ఉన్నారని, వారిని పట్టించుకోకపోవడమే మంచిదని దామిని అన్నారు. నేను వాటిని అస్సలు పట్టించుకోను అని సింగర్ దామీని వెల్లడించింది.