Homeహైదరాబాద్latest Newsసూర్య లాంటి యాక్టర్ తో నేను సినిమా అవకాశాన్ని కోల్పోయాను.. రాజమౌళి

సూర్య లాంటి యాక్టర్ తో నేను సినిమా అవకాశాన్ని కోల్పోయాను.. రాజమౌళి

తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘కంగువ’. దిశా పటాని హీరోయినిగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ రాజమౌళి, హీరో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరుయ్యారు.
ఈ ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ముందుగా పాన్ ఇండియా సినిమాలను ప్రారంభించింది నేను అని చెప్పారు. వాస్తవానికి అది తప్పు. పాన్ ఇండియా సినిమాను ప్రారంభించిన మొదటి వ్యక్తి సూర్య. ఆయన స్ఫూర్తితో నేను పాన్ ఇండియా సినిమాలు తీశాను అని రాజమౌళి అన్నారు. ‘గజనీ’ సినిమా రిలీజ్ సమయంలో తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రమోషన్‌ జరిగిన తీరు చూసి.. నేను కూడా సినిమాను పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలనుకున్నాను.
తమిళంలోనే కాకుండా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సూర్య ఎలా ప్రమోట్ చేస్తున్నాడో నా హీరోలకు చెప్పాను. సినిమాని ఇతర భాషల ప్రేక్షకులకు తీసుకెళ్ళాలంటే సూర్యను ఆదర్శంగా తీసుకోవాలనిఇతర హీరోలకి చెపేవాడిని అని రాజమౌళి అన్నారు. నేను సూర్య కలిసి ఓ సినిమా అనుకున్నాను. కానీ అది కుదరలేదు. అందుకు కారణం నేను అని రాజమౌళి తెలిపారు. గతంలో ఓ మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా చేయలేకపోయాను అని సూర్య అన్నారు. ఆయన చెప్పింది తప్పు. నేను సూర్య లాంటి కంప్లీట్ యాక్టర్ తో సినిమా చేయడం నేను అవకాశాన్ని కోల్పోయానని రాజమౌళి అన్నారు.

Recent

- Advertisment -spot_img