Homeహైదరాబాద్latest Newsరాజకీయ పెద్దలు ఇకనైనా బుద్దిగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను..కేటీఆర్‌

రాజకీయ పెద్దలు ఇకనైనా బుద్దిగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను..కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సొంత కార్యకర్తలకే భరోసా లేదన్న ఆ పార్టీ నేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు అని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి లేరని… పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా బిజీబిజీగా ఉన్నారని, శాంతిభద్రతల అమలులో అంతంత మాత్రంగానే ఉన్నారని ఆరోపించారు. రాజకీయ పెద్దలు ఇకనైనా బుద్దిగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో సొంత పార్టీ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img