Homeహైదరాబాద్latest News''నాకు సీఎం కావాలని ఉంది''.. హీరోయిన్ త్రిష మనసులో మాట..!

”నాకు సీఎం కావాలని ఉంది”.. హీరోయిన్ త్రిష మనసులో మాట..!

హీరోయిన్ త్రిష తన నటన ద్వారా కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంది, ఆమెకు నేటికీ మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. సినీ నటులు, నటీమణులు రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల వైపు మొగ్గు చూపడం సర్వసాధారణమే అయితే హీరోయిన్ త్రిష కూడా తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని వెల్లడించారు. తనకు సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, ప్రజల సేవలో నిమగ్నమవ్వాలన్నదే తన కోరిక, సీఎం కావాలనేది తన కోరిక అని నటి త్రిష అన్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా రాజకీయ పార్టీని ప్రారంభించాడు. విజయ్ త్రిషకు మంచి స్నేహితుడు. విజయ్ పార్టీ తరపున త్రిష పోటీ చేస్తుందా? లేక ఆమె సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా? అనేది త్వరలోనే తెలియనుంది.అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తారా? మరి రాజకీయాల్లోకి వచ్చి జయలలితలా పేరు తెచ్చుకుంటారో లేదో చూడాలి.

Recent

- Advertisment -spot_img