ఇదే నిజం నల్లగొండ: శనివారం రోజు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నల్లగొండ టీఎన్జీవో భవన్ లో ప్రజా సంఘాలు ,ఉపాధ్యాయ ,ఉద్యో,గ మీడియా ,తెలంగాణ ఉద్యమకారుల తో మాట -ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి తనకు వచ్చిన వినతి పత్రాలు రెండు గోనె సంచులు ఉన్నాయని ప్రతి సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని వాటిలో కొన్ని పరిష్కారం అవుతాయని కొన్ని రిప్రెసెంటేషన్ల దశలో ఉన్నాయని ,ఒక ఉప కమిటీ నిర్వహిస్తే ప్రభుత్వ వినతి పత్రాల పరిష్కారం లభిస్తుందని తెలిపారు, ఈరోజు నిర్వహించిన సమావేశంలో చాలా సమస్యలు లేవనెత్తారని అందులో ప్రధానంగా కారుణ్య నియామకాల సమస్య ,కాంటాక్ట్ లెక్చరర్లు, కాంటాక్ట్ ఉపాధ్యాయులు టీచర్ల సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయని, హెచ్ బి టి ల సమస్యలు అవుట్సోర్సింగ్ సమస్యలు వర్ణాతీతం అని వచ్చే కొద్దిపాటి జీతానికి ఆ జీతం కూడా సరైన సమయంలో అందక ఇబ్బందులు గురవుతున్నారని, ఉద్యమకారులు నేటికీ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని అలాంటి సమస్యల పైన ప్రభుత్వం ఒక పరిష్కారం మార్గాన్ని త్వరలో చూపుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూసి పునర్జీవన కార్యక్రమాన్ని వాణిజ్య దృష్టితో చూడకుండా ప్రజల ప్రయోజనాలకను దృష్టిలో పెట్టుకొని ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని పూర్తి చేసే వరకు ఓపిక పట్టాలని దీని ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని కేవలం ఒక శాతం డిఎ మాత్రమే ఇస్తుందని కానీ ముందు ముందు మంచి రోజులు వస్తాయని తెలంగాణ కళాకారుల కోసం కల్చర్ పాలసీ కూడా తన దృష్టిలో ఉందని వాటికి కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల జేఏసీ నాయకులు ఉద్యమకారులు ఉద్యోగుల పి ఎం టి ఏ -టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ , సత్తయ్య, అనిల్ , సలీం, కొండల్ ,పురుషోత్తం, ఆసిఫ్ , రాజు తదితరులు పాల్గొన్నారు.