హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. పిల్లల్ని మాత్రం కనే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పిల్లలు కావాలంటే ఫ్రీజింగ్ ఎగ్స్ విధానాన్ని ఎంచుకుంటానని, భవిష్యత్లో దాని గురించి ఆలోచిస్తానని పేర్కొంది. పెళ్లి కాగానే పిల్లల్ని కనకుండా…కొద్దికాలం తర్వాత తల్లి అవ్వాలనుకునే వాళ్లు తమ అండాలను భద్రపరుచుకుంటారు. IVF ద్వారా పిల్లల్ని కంటుంటారు. ఈ పద్దతినే ఫ్రీజింగ్ ఎగ్స్ అంటారు.