Homeహైదరాబాద్latest Newsఅక్కడికి మా మామ అల్లు అరవింద్ గారితో వెళ్తాను .. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!

అక్కడికి మా మామ అల్లు అరవింద్ గారితో వెళ్తాను .. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఈ టాక్ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాల‌య్య‌తో అన్‌స్టాపబుల్ షోలో సంద‌డి చేసారు. తాజాగా దీనికి సంబందించిన ప్రోమోని ఆహా టీమ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ల ఫోటోను చూపిస్తూ.. ‘మీరు పార్టీకి వెళ్లాల్సి వస్తే ఈ ముగ్గురిలో ఎవరితో వెళ్తారు?’ అని ప్రశ్నించారు. రామ్ చరణ్ స్పందిస్తూ.. నేను ముగ్గురితో వెళ్లను.. మా మామతో వెళ్తాను.. అదే మామయ్య అల్లు అరవింద్ గారే పార్టీకి బెస్ట్ అని చరణ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. కాగా, ఈ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌తో పాటు శర్వానంద్ కూడా సందడి చేసారు.

Recent

- Advertisment -spot_img