Homeతెలంగాణచంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గను..

చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గను..

– బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు ఈటల ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో ముదిరాజ్‌లు 11 శాతం ఉన్నారని, కానీ రాజకీయంగా ఏ పార్టీ ఆదరించడం లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్​ ముదిరాజ్‌లకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. మీటింగ్‌కు వెళ్తే ప్రభుత్వ పథకాలు ఇవ్వమని తనను బెదిరించారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికి తెలుసని, తాను ప్రజల మనిషినని, ప్రజలకోసం తాను ఏం చేయడానికైన సిద్ధమన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

Read More :

మంత్రి Srinivas Goud ​కు ఊరట
http://idenijam.com/a-relief-to-minister-srinivas-goud/

Recent

- Advertisment -spot_img