ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుతో కాంప్రమైజ్ అయ్యానంటూఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరుగు తోందని.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అలా జరగబోదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. బిచ్కుందలోని ఆయన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కు చెందిన సొంత కార్యకర్తలే ఇటీవల గాంధీభవన్ కు వెళ్లి ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారన్నారు. 15ఏళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని.. ఎవరినైనా నయా పైసా అడిగినట్లు వినిపించిందా అని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ నా వద్ద ఉంటే మీకే రాసి ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. జనవరి 8న కోర్టులో పిటిషన్ వేశానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు రికార్డులో బీసీ అని ఉందని, ఎస్సీ కాదని.సంవత్సరంలోపు సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉందన్నారు. న్యాయంపై నాకు విశ్వాసం, నమ్మకం ఉందని పేర్కొన్నారు. అంతేకానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ బిచ్కుంద మండలా ధ్యక్షుడు వెంకటరావ్ దేశాయ్ సొసైటీ ఛైర్మన్ బాలు నాయకులు హన్మాండ్లు, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.