– అణగారిన వర్గాలకు అధికారం రావాలి
– జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: అణగారిన వర్గాలకు, ఎప్పుడూ అధికారం రాని వర్గాలకు సాధికారత రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను మాటలు చెప్పనని.. నిలబడి చూపిస్తానని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డానన్నారు. పవన్ సమక్షంలో శనివారం పలు పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతున్నదని చెప్పారు. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు వారికే ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికే వెళ్లాలి. ఎవరికైతే కేటాయించారో వారికే ఆ నిధులు వెళ్లాలి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టా. అణగారిన, అధికారం చూడని వర్గాలకు సాధికారత రావాలని పేర్కొన్నారు.