Homeహైదరాబాద్latest Newsప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను..! రేవంత్ రెడ్డి పై హరీశ్‌రావు...

ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను..! రేవంత్ రెడ్డి పై హరీశ్‌రావు ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై హరీశ్‌రావు ఫైర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు అని ఆరోపించారు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు అని అన్నారు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు అని నిలదీశారు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అని హరీశ్‌రావు అన్నారు. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Recent

- Advertisment -spot_img