రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. రామ్ చరణ్ ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే టాక్ షో ఆహా ఓటీటీలో ప్రసారమై తెలుగులో టాప్ షోగా నిలిచింది. ఇప్పుడు ఈ షోకి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. తాజాగా ఈ షో ప్రోమోని విడుదల చేశారు. అయితే బాలయ్య మీ కూతురి మొహం ఎప్పుడు చూపిస్తారని ప్రశ్నించగా.. ‘కూతురు ఒక్కసారి నన్ను నాన్నా అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు అందరికి తన కూతురి ముఖం చూపిస్తా’ అని రామ్ చరణ్ చెప్పాడు. ఈ షోలో బాలయ్య చాలా ఫన్నీ మరియు కొన్ని సీరియస్ ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్ వచ్చారు.