తెలుగు సినీ ఇండస్ట్రీ కి బాలనటిగా తెరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ ‘గంగోత్రి’, ‘బాలు’.. తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పై చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ గతేడాది హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ ‘మసూద’లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. హారర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కి తొలి హిట్‌ని అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘బలగం’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న కావ్య కళ్యాణ్ ఇటీవల సినిమాల సంఖ్యను తగ్గించింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన కావ్య.. ‘నేను పాత హీరోలతో అసలు నటించను’ అని పేర్కొంది. నాకు సీనియర్ హీరోలతో సినిమాలో ఆఫర్ వచ్చింది కానీ అతనితో సినిమా చేయనని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.