ఇటీవల డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. డీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల వీరంతా తమను యథావిధిగా బదిలీ చేయకుండా ఉంచాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని అక్కడ నిరాకరించడంతో తాజాగా బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.