ICC Champions Trophy: క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ఐసీసీ టైటిల్ సిద్ధమైంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టాప్ 8 జట్లు వన్డే ఫార్మాట్‌లో ఆడే ఈ టోర్నమెంట్‌పై భారీ హైప్ ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈక్రమంలో భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో ఉంచారు. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌ల టికెట్లన్నీ హాట్‌కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. సాధారణ స్టాండ్ టికెట్ల ప్రారంభ ధర యూఏఈ దిర్హమ్‌లు 125 (సుమారు రూ.2,965)గా నిర్ణయించారు. భారత్, పాక్ మ్యాచ్ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో సుమారు 1,50,000 మంది పోటీపడినట్లు సమాచారం.