Homeహైదరాబాద్latest NewsICC ODI rankings: ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ల జోరు.. రోహిత్ హిట్.. విరాట్ ఫట్..!

ICC ODI rankings: ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ల జోరు.. రోహిత్ హిట్.. విరాట్ ఫట్..!

ICC ODI rankings: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ల జోరు కొనసాగుతుంది. రోహిత్ శర్మ రెండు ర్యాంక్ మెరుగుపడి 3వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి 5వ స్థానానికి చేరుకున్నాడు. అయితే శుభ్‌మాన్ గిల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు ఉండటం గమనార్హం. అలాగే బౌలర్ల విభాగంలోను టీమిండియా చైనామన్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి 650 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహేష్ టీకషానా 680 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 616 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి టాప్ 10 లోకి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా టాప్-10లో కొనసాగుతున్నాడు. 220 పాయింట్లతో అతను పదో స్థానంలో ఉన్నాడు. అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img