టీ20 ఫార్మాట్‌లో తాజాగా ఐసీసీ ర్యాంకులను(ICC T20 Rankings) ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య ఆరో స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరాడు. అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు పైకి ఎగబాకి 16వ ర్యాంకును అందుకొన్నాడు.ఈ జాబితాలో రవి బిష్ణోయ్ ఐదో స్థానంలో ఉన్నాడు.