ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులకు అలర్ట్. పొదుపు ఖాతాలపై ఛార్జీలను సవరించింది ఆ బ్యాంక్. డెబిట్ కార్డులు, చెక్‌బుక్ లీవ్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించి ఛార్జీలను సవరించింది.
ఆ వివరాలు…
1. డెబిట్ కార్డుపై వార్షిక రుసుం : పట్టణ ప్రాంతాల్లో రూ.200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.99
2. చెక్‌బుక్స్ : ఏడాదిలో 25 చెక్ లీవ్స్‌కు ఛార్జీలు లేవు. ఆపై తీసుకున్న ఎక్స్ట్రా చెక్ లీవ్స్‌కు ఒక్కోదానికి రూ.4 చొప్పున వసూలు చేస్తారు.
3. IMPS ఔట్‌వార్డ్ : రూ.1000 లోపు లావాదేవీలపై రూ.2.50 వసూలు చేస్తారు. రూ.1000-రూ.25000 వరకు చేసే లావాదేవీలపై రూ.5; రూ.25000 నుంచి రూ.5లక్షల లోపు ట్రాన్సాక్షన్లపై రూ.15 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.
4. సంతకం ధ్రువీకరణ : ఒక దరఖాస్తు/ లేఖకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు.
5. ECS / NACH డెబిట్ రిటర్న్స్ : ఈసీఎస్ / ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్ అనేది బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థలు విధించే ఒక రకమైన రుసుము. ఇది రూ.500 ఉంటుంది.
6. స్టాప్ పేమెంట్ ఛార్జీలు : పర్టికులర్ చెక్ రూ.100 (కస్టమర్ కేర్ IVR & నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితం)
క్యాష్ డిపాజిట్ ఛార్జీలు
బ్యాంకు హాలీడే సమయంలో, బ్యాంకు పని రోజుల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.10 వేల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే, ప్రతి లావాదేవీపై రూ.50 రుసుము విధిస్తారు. ఈ ఛార్జీలు సీనియర్ సిటిజన్లకు, బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్, జన్ ధన్ అకౌంట్లకు వర్తించవు. అలాగే దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్నవారు, స్టూడెంట్ అకౌంట్లకు కూడా ఈ ఛార్జీలు వర్తించవు.
- చెక్ రిటర్న్ ఔట్‌వార్డ్ : రూ.200
- చెక్ రిటర్న్ ఇన్వార్డ్ : రూ.500 (ఆర్థిక లావాలదేవీలకు), రూ.50 (నాన్-ఫైనాన్సియల్ లావాలదేవీలకు)
- మీ ఖాతాలో డబ్బులు లేకుండా నాన్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలు చేసినప్పుడు, ప్రతి డిక్లైన్డ్ ట్రాన్స్క్షన్కు రూ.25 చొప్పున ఛార్జీలు వసూలు.
- కార్డు రిప్లేస్మెంట్ (పోయినా / డేమేజ్ అయినా) : రూ.200
- వీటితో పాటు NEFT, RTGS లావాదేవీలకు విధించే ఛార్జీల్లోనూ ఐసీఐసీఐ బ్యాంకు మార్పులు చేయలేదు.