Homeహైదరాబాద్latest Newsమెగా బ్రదర్స్‌కు ఐకాన్ స్టార్ విషెస్

మెగా బ్రదర్స్‌కు ఐకాన్ స్టార్ విషెస్

మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపాడు. భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ దక్కించుకోవడం ఎంతో గర్వకారణమన్నాడు. తెలుగు ప్రజల కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఈ క్షణాలు మరిచిపోలేనివని తెలిపాడు. మరోవైపు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోన్న పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలిపాడు. ‘జనం కోసం నిరంతరం తపిస్తూ మీరెంచుకున్న మార్గం గొప్పది. ఒక కుటుంబ సభ్యునిగా నా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు అభినందనలు’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు.

Recent

- Advertisment -spot_img