ఒకప్పుడు బాత్రూమ్ అంటే ఇంటి బయటగా ఒక మూల ఒక షెడ్‌లా కట్టేవారు.
ఇప్పుడు ఇంటికి రీసేల్ వాల్యూ ఉండాలంటే కిచెన్ తరువాత బాత్రూమ్ ఎలా ఉందీ అనే చూస్తున్నారు.
అందుకే, మీరు కొత్త ఇంట్లో కొత్తగా బాత్రూమ్ కడుతున్నా, ఉన్న ఇంట్లోనే రెనొవేషన్స్ చేస్తున్నా, కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోండి.
బాత్రూమ్‌కి ఇప్పుడు ప్రాక్టికల్ పర్పస్‌ల కంటే కూడా రిలాక్సేషన్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు.
పైగా, ఇందులో ఉండే కష్టమేమిటంటే వివిధ రకాల ఫిట్టింగ్స్ ఉండాలి, మరీ ఎక్కువ స్పేస్ మాత్రం ఉండదు.
అందుకే మొదటి నుండీ ఒక ఐడియాతో ఉంటే డబ్భులు వేస్ట్ అవ్వకుండా, మనకి కావాల్సిన పద్ధతిలో బాత్రూమ్ డిజైన్ చేయించుకోవచ్చు. సో, మీరు ఇక్కడ మొదలు పెట్టాలి..
1. ఎవరు వాడతారు..
ప్రతి బాత్రూమ్‌ని దాన్ని వాడే వాళ్ళని బట్టి డిజైన్ చేసుకోవాలి. మాస్టర్ బెడ్‌రూమ్‌కి ఎటాచ్డ్‌గా ఉండే బాత్రూమ్ ఒకలా ఉంటే కిడ్స్ బాత్రూమ్ ఇంకోలా ఉంటుంది,
గెస్ట్ బాత్రూం మరొకలా. మీ బాత్రూమ్ స్పా లాగా ఉండాలంటే బాత్, సెపరేట్‌గా షవర్, డబుల్ బేసిన్స్, బోలెడంత స్టోరేజ్.. ఇవన్నీ అవసరమవుతాయి.
పిల్లల బాత్రూమ్ ట్రెండీగా ఉండాలి. గెస్ట్ బాత్రూమ్‌లో ఇవన్నీ అవసరం లేదు, బేసిక్ బాత్రూం సరిపోతుంది.
2. స్పేస్ ఎంత ఉంది..
మీ స్పేస్ యొక్క స్కేల్ ప్లాన్‌తో స్టార్ట్ చేయడం మంచి పద్ధతి. మెజర్మెంట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే, తలుపులు, కిటికీలకి సరైన స్పేస్ ఇవ్వగలుగుతారు.
షవర్, సింక్, కమోడ్, స్టోరేజ్ ప్రతి వాటిని స్కేల్ షేప్స్‌లో కట్ చేసి మీరు అనుకుంటున్న పద్ధతిలో వచ్చే వరకూ రకరకాల పద్ధతుల్లో వీటిని అరేజ్ చేసుకుని చూడండి. వీలున్నంత స్పేస్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.
3. ఎక్స్‌పర్ట్స్‌ని అడగండి..
బాత్రూమ్ డిజైన్ అనేది పూర్తిగా మీ అంతట మీరే చేయలేరు, ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరం పడుతుంది.
ఎలాగూ తప్పనప్పుడు ఆ పని ముందే చేస్తే సమయం కలిసి వస్తుంది.
వీరు లేటెస్ట్ టెక్నాలజీ, అందుబాటులో ఉన్న మెటీరియల్స్ గురించి వివరంగా మీకు చెప్పగలుగుతారు.
ఉన్న స్పేస్‌ని బాగా వాడుకోవడం మీద వారికి మంచి ఎక్స్పీరియెన్స్ ఉంటుంది.
4. లేఅవుట్ చూజ్ చేసుకోండి..
మీ బాత్రూమ్ లేఅవుట్‌ని మార్చాలి కాబట్టి మార్చకండి.
ప్రస్తుతం ఉన్న లేఅవుట్ బాగానే ఉంటే ఆ లేఅవుట్ ని అలాగే కంటిన్యూ చేసి చిన్న చిన్న మార్పుల ద్వారా మీకు కావాల్సిన ఎఫెక్ట్ రాబట్టగలరేమో చూడండి.
ఫ్లోరింగ్, టైల్స్ రిప్లేస్ చేయడం, గోడలకి కొత్త రంగులు వేయించడం వల్ల బాత్రూం కొత్తగా కనిపిస్తుంది, మీకు అనవసరంగా మార్చే పని తప్పుతుంది, ఖర్చు కలిసి వస్తుంది.
లేఅవుట్ సరిగ్గా లేకపోతే చిన్న చిన్న మార్పుల ద్వారా దాన్ని సరిదిద్దవచ్చేమో చూడండి.
5. ఇన్స్పిరేషన్ తీసుకోండి..
మొదట్లోనే మీకు ఎలాంటి స్టైల్ కావాలో తేల్చుకోండి. స్టైల్ విషయంలో ఒక ఐడియాకి వచ్చేస్తే ఫిట్టింగ్స్ సంగతి తేల్చుకోవచ్చు.
రకాల హోటల్స్, స్పాస్, రిసార్ట్స్ వాళ్ళ వెబ్సైట్స్ చూడండి, మీకు బోలెడన్ని ఐడియాలు వస్తాయి.
పైగా వీళ్ళందరూ తక్కువ స్పేస్ నే బాగా యుటిలైజ్ చేయడం ఎలాగో తెలిసిన వాళ్ళు.
రీసెంట్ గా ఇల్లు కట్టుకున్న లేదా రెనొవేట్ చేసిన ఫ్రెండ్స్ తో మాట్లాడండి, వాళ్ళ ఎక్స్పీరియెన్సులు తెలుసుకోండి.
6. స్పేస్ విషయంలో రియలిస్టిక్‌గా ఉండండి..
లేని స్పేస్ గురించి ఆలోచించడం, అయ్యో ఇంకాస్త స్పేస్ ఉంటే ఇవి కూడా అమర్చుకునే వాళ్ళం అనుకోవడం వృధా.
కాబట్టి, ఉన్న స్పేస్ ని ఎంత బాగా వాడుకోవచ్చో ఆలోచించండి.
స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఫిట్టింగ్స్ పెట్టెస్తూ ఉంటారు కొంత మంది, అలా చేస్తే బాత్రూమ్ ఇరుకిరుగ్గా తయారవుతుంది.
స్టైల్ ఎక్కువ, కంఫర్ట్ తక్కువ అయిపోతుంది.
7. స్టోరేజ్..
బాత్రూమ్‌లో కంపల్సరీగా ఉండవలసిన ఇంకొక ఐటం స్టోరేజ్. ఏదో ఒక చిన్న షెల్ఫ్ పెట్టేస్తే పోతుందిలే అనుకునే రోజులు కావివి.
పైగా మీరు వాడే షాంపూలు, సోప్స్, షేవింగ్ క్రీమ్స్ ఇవన్నీ బయటకి కనపడుతూ ఉన్నా బావుండదు.
కాబట్టి, ఇవన్నీ దాచి ఉంచడానికీ, ఎక్స్ట్రా టవల్స్ పెట్టుకోవడానికీ మీకు సరిపోయే స్టోరేజ్ అవసరం.
8. వెంటిలేషన్..
కొన్ని కొన్ని బాత్రూమ్స్‌లోకి అసలు బయట నుండి వెలుతురే రాదు.
పగలు కూడా లైట్ వేస్తే తప్ప ఎక్కడ ఏముందో కనిపించకుండా ఉండేంత చీకటిగా ఉంటాయవి.
అలా కాకుండా, బాత్రూమ్స్ లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి. అప్పుడే బాత్రూం ఫ్రెష్ గా ఉంటుంది, నీట్ గా క్లీన్ గా ఉంటుంది.
9. లైటింగ్..
బాత్రూమ్స్ మిగిలిన రూమ్స్ కి ఎటాచ్ అయి ఉంటాయి కాబట్టి బాత్రూమ్స్ లో వాడే లైటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి,
బెడ్రూమ్స్ లో వాడే లైటింగ్ తో బాత్రూమ్స్ లో వాడే లైటింగ్ క్లాష్ అవ్వకూడదు.
ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏమిటంటే లెవెల్స్ ఆఫ్ లైటింగ్ ఎరేంజ్ చేసుకోవడం.
బాత్రూమ్ డోర్ నాబ్ తిప్పగానే విలిగే లైట్లు కూడా మంచి ఆప్షనే.
10. టైల్స్..
ట్రెండ్ ఫాలో అవ్వాలంటే తేలీకిన పద్ధతి టైల్సే. స్పేస్ చిన్నగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ డిజైన్స్ ఉన్న టైల్స్ గాడీగా కనిపించవచ్చు.
అలాగే, ఇప్పుడు జారని టైల్స్ వాడుతున్నారు బాత్రూమ్స్ లో, అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
చివరగా..
బాత్రూమ్ ప్లాన్ చేసుకునేప్పుడు ప్రస్తుతం మీరెలా వాడుతున్నారు అనే దాని కంటే కూడా మీరెలా వాడదామనుకుంటున్నారు అనే పాయింట్ ప్రాతిపదికగా డిజైన్ చేయించుకోవాలి అంటున్నారు నిపుణులు.