Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో మరోసారి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం

హైదరాబాద్ లో మరోసారి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం

హైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ కాలనీలోని హనుమాన్‌ దేవాలయానికి పూజ చేసేందుకు పూజారి ఈరోజు వెళ్లారు. అయితే ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలను గుర్తించి స్థానికులతోపాటు పోలీసులకు పూజారి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం అర్ధరాత్రి అగంతకులు ఆలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హనుమాన్ ఆలయ విగ్రహాలను ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే గతంలో సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img