ఇదే నిజం, దేవరకొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని నేడు దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై,మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు.
ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పూజించాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే పర్యావరణ సమతుల్యతదెబ్బతింటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, కమీషనర్ భాస్కర్ రెడ్డి, డి.ఎస్.పిగిరిబాబు, ఆర్డీవో శ్రీరాములు, తహసీల్దార్ సంతోష్ కిరణ్, కౌన్సిలర్లు సైదులు,కొండ్ర మల్లీశ్వరి శ్రీశైలం యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్దన్ రెడ్డి,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య,సతీష్ రెడ్డి,ప్రదీప్,గాజుల మురళి,మున్సిపల్ సిబ్బది తదితరులు పాల్గొన్నారు.