మగవారిలో ఈ లక్షణాలు ఉంటే ఏ అమ్మాయినైనా ఇట్టే పడేయొచ్చు.. అవి ఏంటో తెలుసుకుందామా..
సెన్సాఫ్ హ్యూమర్
సాధారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ల వల్ల మానసికంగా కృంగిపోతుంటారు. ముఖ్యంగా ఆడవారు ఇంటా బయట ఎదుర్కొనే సమస్యలు కోకొల్లలు. వారిని నవ్వించే హాస్యచతురతే ఉంటే అమ్మాయి గుండెల్లో స్థానం సాధించడం చాలా సులభం అవుతుంది. అమ్మాయిలకు మాటలన్నా, మాట్లాడటమన్నా చాలా ఇష్టమని స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇష్టమైన వాడితో గంటలకొద్దీ మాట్లాడాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. అందుకే నవ్విస్తూ ఎక్కువసేపు వారితో కబుర్లు చెప్పే సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయి అమ్మాయిల మనుషులను త్వరగా గెలుచుకుంటాడు. అలానే ఆడవారిని ఇంప్రెస్ చేయాలంటే ఏ విషయాన్నైనా మాట్లాడేటప్పుడు దానిని సరదాగా మలిచే సామర్థ్యం ఉండాలి. ఇది అమ్మాయిలలో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా వారిని అబ్బాయిలకు మరింత దగ్గర చేస్తుంది.
ఆత్మవిశ్వాసం
అహంకారం లేని ఆత్మవిశ్వాసం ఒక అద్భుతమైన లక్షణం. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది ఒక అయస్కాంతంలా మిగతావారిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆడవారి మనసులు దోచేస్తుంది. మనందరిలోనూ లోపాలు ఉంటాయి. అయితే, ఆ లోపాలతో సహా మనల్ని మనం అంగీకరించడం చాలా ముఖ్యం. ఉన్న అందంతో సంతృప్తి చెందడం, సెల్ఫ్-లవ్ కురిపించుకోవడం వంటివి నిజమైన ఆత్మవిశ్వాసంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ జీవితం పట్ల సానుకూలంగా ఉంటాడు. ఇది చుట్టూ ఉన్న వారిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలడు. అమ్మాయిలకు ప్రతి విషయంలో భరోసా ఇవ్వగలడు. తద్వారా ఆమెను ఇంప్రెస్ చేయగలడు.
సహానుభూతి
సహానుభూతి అనేది ఇద్దరి హృదయాలను కలిపే ఒక అద్భుతమైన లక్షణం. సానుభూతి చూపించే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. నిజానికి మనం ఎంతో మందితో కలిసి సమయం గడుపుతుంటాం కానీ చాలా అరుదుగా మాత్రమే మరొకరి మనసును అర్థం చేసుకొని వారి భావాలను తెలుసుకోగలం. ఈ అద్భుతమైన లక్షణాన్నే సహానుభూతి అంటాం. సానుభూతి కలిగిన వ్యక్తి ఒక స్నేహితుడి భావాలను తన భావాలలా భావించగలడు, ఒక ప్రియమైన వ్యక్తి బాధను తన బాధలా భావించగలడు. వారికి కష్ట సమయాల్లో ఒక ఆసరాగా నిలబడగలడు.
నిజాయితీ
ఒక అమ్మాయికి, నిజాయితీగా ఉండే అబ్బాయి కంటే ఆకర్షణీయమైనది ఏముంటుంది? మగవారు ఆడవారి గుండెల్లో స్థానం సంపాదించుకోవాలంటే ఏ విషయంలోనూ నటించకూడదు. భావాలను బహిరంగంగా వ్యక్తపరచగల ధైర్యం కూడా చాలా ముఖ్యం. ఈ నిజాయితీ పునాదిగా మారి ఆడవారితో శాశ్వతమైన, నమ్మకమైన రిలేషన్‌షిప్‌కు దారితీస్తుంది.