హైడ్రా అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ (ACB) స్పందించింది. ఎవరైనా పాత నోటీసులు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.