Homeహైదరాబాద్latest Newsఆ సినిమా చూసి ఉంటే 'ది గోట్' మూవీని బాగా తీసేవాడిని.. వెంకట్ ప్రభు ఓపెన్...

ఆ సినిమా చూసి ఉంటే ‘ది గోట్’ మూవీని బాగా తీసేవాడిని.. వెంకట్ ప్రభు ఓపెన్ కామెంట్స్..!

దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్‌గా నిలిచింది. ఈ విడుదలైన సమయంలో, ఈ సినిమా గతంలో చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ నటించిన ‘రాజదురై’ సినిమాకి కాపీ అని టాక్ వచ్చింది.రెండు సినిమాల కథ కూడా కొన్ని విషయాల్లో ఒకేలా ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు.. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభు ఈ విషయమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. కానీ నేను ఆ సినిమాని చూడలేదు.అలాంటి చర్చల తర్వాతే సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. అయితే ‘ది గోట్’ మూవీ విడుదలకు ముందే నేను ఈ ఆ సినిమాని చూసి ఉంటే, నేను ఖచ్చితంగా ‘ది గోట్’ సినిమాని బాగా తీసి ఉండేవాడిని అని వెంకట్ ప్రభు తెలిపారు.

Recent

- Advertisment -spot_img