Homeతెలంగాణఎన్నికల్లో ఓడిపోతే నా శవయాత్రే

ఎన్నికల్లో ఓడిపోతే నా శవయాత్రే

– హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్​ రెడ్డి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో హుజురాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ కౌశిక్‌రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశమివ్వాలని ఓటర్లను వేడుకున్నారు. మాకు ఓటేయకుంటే మా ముగ్గురు శవాలను చూడండీ అంటూ ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. ‘ఓటేసి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తా.. లేకపోతే డిసెంబర్ 4న నా శవయాత్రకు రండి అంటూ ఓటర్లకు షాక్ ఇచ్చారు. ‘మీ కడుపులో తలపెడతా.. మీ కాళ్లు పట్టుకుంటా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ దయ, మీ దండం.. ఒక్కసారి కాపాడండి.. ఒక్కసారి కాపాడండి.. గెలిపించండి.. ఓడగొట్టి ఉరితీసుకోమంటారా’అంటూ పాడి కౌశిక్​ రెడ్డి ఊహించని కామెంట్స్ చేశారు.

Recent

- Advertisment -spot_img