చాలామందికి ఆదివారం వస్తే చాలు.. చుక్క, ముక్క లేనిదే రోజు గడవదు. కానీ ఆ గ్రామంలో అలా కాదు.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా ఆదివారం మాత్రం శాఖాహార భోజనం మాత్రమే తినాలి. ఇది ఎక్కడో కాదు.. మన తెలంగాణ లోని, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఇలా చేస్తారు. ప్రతి ఆదివారం కేవలం శాఖాహార భోజనం మాత్రమే తింటారు. మద్యానికి దూరంగా ఉంటారు. మల్లన్న స్వామిని ప్రీతికరమైన ఆదివారం మాత్రం నిష్టతో ఉంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.