Homeహైదరాబాద్latest Newsకేసీఆర్ కు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి.. సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి.. సీఎం రేవంత్ రెడ్డి

పది నెలల్లో తెలంగాణ ఏమీ కోల్పోలేదుని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పది నెలల్లో కోల్పోయిన స్వేచ్ఛను, ఆర్ధిక స్వావలంబను మహిళలు సాధించారు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘాని ఏకైక అధ్యక్షుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపంచారు. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక తాగుబోతుల సమూహంగా మార్చి, బెల్టు షాపులతో మత్తులో ముంచారు అని ధ్వజమెత్తారు. తెలివిగల తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అని గుర్తు చేసారు. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది అని తెలిపారు. కెసిఆర్ కి దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని అన్నారు. అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్హహౌస్ లో పడుకోవడమా కేసీఆర్ విధానం అని ఆరోపించారు. అన్ని అంశాలపై చర్చించడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేసారు. మద్దతు ధర, బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో ప్రపంచ రికార్డు సాధించింది అని అన్నారు. 18 వేల కోట్ల ఆదాయంలో 13 వేల కోట్లు జీతభత్యాలు, కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీకే పోతున్నాయి అని వాపోయారు. అభినందించడానికి నోరు రాని బిల్లా రంగాలు కాళ్లల్లో కట్టె పెట్టడానికి తిరుగుతున్నారు అని ధ్వజమెత్తారు. కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి పదేళ్లయినా మీకు చేతులు రాలేదు అని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని వాపోయారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే.. జైల్లో పెట్టిస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img