ఇదే నిజం దేవరకొండ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని దేవరకొండ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పక్కా సమాచారం మేరకు దేవరకొండ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో నుండి ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ బియ్యని పట్టణానికి చెందిన తేలుకుంట్ల రమేష్ కొనుగోలు చేసినట్లు నిర్ధారించారని అన్నారు. ఆటోలో సుమారు14 బస్తాలలో (6 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించి, ఆటో సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దేవరకొండ నుంచి చారగొండకి రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని రవాణా చేసినా, కొనుగోలు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిరుపేదలకు చెందాల్సిన పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా ఎవరైనా తరలిస్తే వారి పై చర్యలు తీసుకుంటామని అన్నారు. రేషన్ డీలర్లు ఎవరైనా కార్డుదారుల వద్ద బియ్యం కొంటె వారిపై కేసు నమోదు చేస్తామని, కార్డుదారులు బియ్యం తీసుకొని దళారులకు అమ్మినట్లయితే వారి కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు.